బ్యాడ్ న్యూస్: వరల్డ్ కప్‌ నుంచి ధావన్ అవుట్…

- Advertisement -

లండన్: గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్ కప్ పోటీలకు దూరం కానున్నాడు. బొటనవేలు గాయం కారణంగా శిఖర్  మూడు వారాల పాటు ప్రపంచకప్ టోర్నమెంటు నుంచి వైదొలగనున్నాడు.

ఓవల్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఎడమ చేతి బొటనవేలుకు బంతి బలంగా తగిలింది. చేతికి గాయమైనప్పటికీ పట్టు వదలకుండా.. బ్యాటింగ్ చేసిన ధవన్.. ఆస్ట్రేలియాపై 117 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అయితే సోమవారం స్కానింగ్ చేయడంతో వేలు ఎముక చిట్లినట్టు తేలింది. ఈ గాయం కారణంగా వచ్చే మూడు వారాల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లపై జరిగే మ్యాచ్‌లలో శిఖర్ ధవన్ ఆడే అవకాశం లేదు.

షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ జూన్‌లోనే జరగనున్నాయి. శిఖర్ ధవన్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్‌లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

చదవండి: విండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం….పాయింట్ల పట్టికలో టాప్‌లో కివీస్
- Advertisement -