ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు జగన్ ఏం చేయబోతున్నారో తెలుసా!?

10:09 am, Mon, 15 April 19
1
jagan next plan

అమరావతి: ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఫలితాలకు ఎన్నడూ లేని విధంగా.. 40 రోజులకుపైగా సమయం ఉంది. అందుకే చాలా మంది నేతలు రిలాక్స్ మూడ్‌‌లోకి వెళ్లిపోతున్నారు. దాదాపు రెండు నెలల నుంచి, ప్రచారంలో నెలరోజులపాటు నిద్రాహారాలు చూసుకోకుండా గడిపిన నేతలు ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు.

మరి ఈ నలబై రోజులు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఏం చేయబోతున్నారో తెలుసా? అసలే ఎండల్లో ప్రచారం చేసిన జగన్ శరీర ఛాయ కూడా కాస్త తగ్గింది. విశ్రాంతితోపాటు నిపుణుల సలహాలు తీసుకుని తన శరీర ఛాయను మెరుగుపరుచుకునే ప్లాన్ ఉందట.

చంద్రబాబు వైఖరితో మారిన షెడ్యూల్?

ఆ తర్వాత ఫ్యామిలీతో ఫారిన్ టూర్ కూడా అనుకున్నారట. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరితో జగన్ షెడ్యూల్‌‌లోనూ మార్పులు వస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో గోలగోల చేస్తుండటంతో.. ఈ సమయంలో తాము రిలాక్స్ అవకూడదని, సైలెంట్ మూడ్‌లో ఉన్నా ఇబ్బందేనని జగన్ భావిస్తున్నారు.

ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌లపై ఓ కన్నేసి ఉంచడం. చంద్రబాబు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం వంటి చర్యలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

అంతేకాదు, ఎన్నికల్లో వివిధ కారణాలతో పార్టీలో చాలామంది అర్హులకు జగన్ టికెట్‌ ఇవ్వలేకపోయారు. అలాంటి వారిని పిలిచి మాట్లాడే అవకాశం కూడా ఉంది. అధికారంలోకి వస్తే.. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలనే అంశంపైనా జగన్ మేధోమథనం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.