ఆంధ్రకి అన్యాయం, ‘జల్లికట్టు’ గుర్తులేదా? ‘హోదా’ కోసం మన హీరోలు ఏం చేస్తున్నారు?: చలసాని శ్రీనివాస్ ఫైర్

chalasani srinivas slams Telugu cineindustry for andhra special status
- Advertisement -

chalasani srinivas slams Telugu cineindustry for andhra special status

విశాఖపట్నం: తెలుగు సినీ హీరోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని అన్యాయం చేస్తున్నారని ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ నేత చలసాని శ్రీనివాస్ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం.. ప్రత్యేక హోదా సాధన సమితి నేతృత్వంలో చేపట్టిన సమరయాత్రలో పాల్గొన్న ఆయన ఆంధ్రకి అన్యాయం జరుగుతున్నా తెలుగు సినీ హీరోలు కానీ, సినీ రంగ ప్రముఖులుకాని అసలు సినీ రంగంకానీ పోరాటంలో పాల్గొనడనికి ఎవరు ముందుకు రావడం లేదని విమర్శించారు.

మరోవైపు ఆంధ్ర సీఎం చంద్రబాబునాయుడుపై కూడా చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని ఇచ్చిన మాట తప్పారని.. నాలుగేళ్లుగా ఎటువంటి పోరాటం చేయకుండా ఉండి.. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

హోదా సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా సమరయాత్ర నిర్వహిస్తున్నామని.. ప్రజలు తమకు మద్దతు ప్రకటించాలని కోరారు. తమిళ సినీరంగం మొత్తం కలిసి ‘జల్లికట్టు’ కోసం ముందుకొచ్చి పోరాడి సాధించిందని చలసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

- Advertisement -