ఇడియట్‌లే వాటిని నమ్ముతారు: జనసేన నేత లక్ష్మీనారాయణ

1:48 pm, Sun, 11 August 19

అమరావతి: జనసేనకు తాను గుడ్ బై చెప్పబోతున్నట్టు వస్తున్న వార్తలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు.
తనపై వస్తున్న వార్తలను చూసి షాకైనట్టు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వ్యతిరేకపరులు పుకార్లను వ్యాపిస్తుంటారని అన్నారు. ఆ పుకార్లను ఫూల్స్ విస్తరిస్తుంటారని, ఇడియట్‌లు వాటిని నమ్ముతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులో మీరెక్కడున్నారో తేల్చుకోవాలంటూ ఆప్షన్‌ను వదిలిపెట్టారు.

ఆ తర్వాత మరో ట్వీట్‌లో.. తన సేవలు జనసేన అధినేతకు అవసరం అయ్యే వరకు అదే పార్టీలో ఉంటానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లతో మీ సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. ఆ సమయాన్ని వరద బాధితులకు సహాయం చేస్తూనో, మొక్కలను నాటడానికో, ప్లాస్టిక్‌ను తొలగించేందుకో, యువతలో స్ఫూర్తిని రగిలించేందుకో ఉపయోగించాలని కోరారు. చివర్లో జైహింద్ అని ముగించారు.