సీఎం వైఎస్ జగన్ టీంలోకి మరో ఉన్నతాధికారి! డిప్యూటేషన్‌పై ఏపీకి, పోస్టింగ్ ఎక్కడో?

11:26 pm, Mon, 8 July 19
av-dharma-reddy-ys-jagan

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీమ్‌లోకి మరో ఐఏఎస్ అధికారి వచ్చి చేరారు. ఈయన పేరు ఏవీ ధర్మారెడ్డి. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా ధర్మారెడ్డి డిప్యుటేషన్‌పై ఆంధ్ర్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. 

చదవండి: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్! సచివాలయం, ఇర్రం మంజిల్ భవనాలు కూల్చివేతపై స్టే…

ధర్మారెడ్డి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టీటీడీ జేఈవో, తిరుమల స్పెషల్‌ ఆఫీసర్‌గా సమర్ధవంతంగా పనిచేసి గుర్తింపు పొందారు. అనంతరం ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.

వైఎస్ జగన్ కోరిక మేరకు…

గతంలో ఏపీలో కీలక పోస్టులు నిర్వహించి ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులను తిరిగి ఏపీకి కేటాయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. 

గతంలో టీటీడీకి ధర్మారెడ్డి చేసిన సేవలకు మెచ్చి మరొకసారి ఆయనకు తిరుమలలో పని చేసే అవకాశం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. 

చదవండి: లోకేష్ చెల్లని కాణీయా? మరి వైఎస్ విజయమ్మ సంగతేంటి?: బుద్ధా వెంకన్న ఫైర్

ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ధర్మారెడ్డిని టీటీడీ జేఈవోగా నియమిస్తారా? లేక మరేదైనా కీలక శాఖకు నియమిస్తారా? అన్నది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.