ఇక కాచుకో చంద్రబాబు! నేనొస్తున్నా.. జగన్ తరఫున ప్రచారం చేస్తా: అసదుద్దీన్ ఓవైసీ

asaduddin-owaisi
- Advertisement -

హైదరాబాద్: జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో పాకిస్థాన్ భారత జవాన్లను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారత్ శత్రువులైనవారు ఇక్కడి ముస్లింలందరికీ శత్రువులేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చెరలో ఉన్నప్పటికీ ధైర్యంగా, స్థిరచిత్తంతో వ్యవహరించిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పోరాటం నిజంగా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు.

ఏపీలో వైసీపీకే మద్దతు ఇస్తాం…

హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరికలు పంపారు. ‘చంద్రబాబూ… కాచుకో.. నేను ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నా.. ఎన్నికల్లో జగన్ కు ప్రచారం చేస్తా’ అని తెలిపారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు, ఏపీలో వైసీపీకి తమ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. అంతకుముందు మాట్లాడుతూ.. పుల్వామా ఉగ్రదాడిలో భారత ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మాహుతి దాడులు, బాంబు దాడులను ఇస్లాం అంగీకరించదని తేల్చిచెప్పారు.

చదవండి : జగన్ వస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లూ గల్లంతే, నన్ను తిట్టడానికే మోడీ..

- Advertisement -