ఏపీలో ఉప ఎన్నికల నిర్వహణకు నో ఛాన్స్: సీఈసీ ఓపీ రావత్

Election_Commission (1)
- Advertisement -

Ravant

న్యూఢిల్లీ: శనివారం నాడు ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఆంద్రప్రదేశ్‌లో జరగాల్సిన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు.  2019 జూన్ 4వ తేదీతో ఆ లోక్‌సభల పదవీకాలం గడువు ముగుస్తుంది. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన నియోజకవర్గాలకు కనీసం ఏడాది కాలం అయిన ప్రజాప్రతినిధులు పదవిలో ఉండాలి. ఏడాదిలోపు పదవీ కాలం ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం లేదని ఎన్నికల చట్టంలో స్పష్టంగా ఉంది.

ఈ సంవత్సరం జూన్ 3న  వైకాపాకు చెందిన ఐదుగురు ఏంపీల రాజీనామాలను ఆమోదించారు. అప్పటి నుంచి లెక్క చూస్తే వచ్చే ఏడాది జూన్ 4వ తేదీతో లోక్‌సభ పదవీ గడువు ముగియనుంది.. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు అని ఓపీ రావత్ స్పష్టం చేశారు.

- Advertisement -