పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్: టీడీపీ మహిళా నేత యామినీపై నటి మాధవీలత ఫైర్

pawan-yamini-maadhavi
- Advertisement -

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ మహిళా నేత యామినీ సాధినేని చేసిన వ్యాఖ్యలపై.. పవన్ అభిమాని, సినీనటి మాధవీలత సోషల్ మీడియా సాక్షిగా మండిపడ్డారు. ‘‘ఇన్నాళ్లూ పోనీలే అని ఊరుకున్నా.. ఇప్పుడు నాకు కాలింది..’’ అంటూ మాధవీలత.. యామినీపై ఫైర్ అయ్యారు.

ఇటీవల జనసేన ఆధ్వర్యంలో రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజిపై కవాతు, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ మహిళా నేత యామినీ సాధినేని స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌ను సోషల్ మీడియా వేదికగా విమర్శించడం ఇలా విమర్శల పర్వానికి దారితీసింది.

ఫేస్‌బుక్ తాజా పోస్టులో…

తన ఫేస్‌బుక్ పేజీలో సినీనటి మాధవీలత తాజాగా ఒక పోస్టు పెట్టారు. “ఇన్నాళ్లు పోనీలే అని ఊరుకున్నా.. ఇప్పుడు నాకు కాలింది.  మల్లెపూల విషయం ఏంటో దగ్గర్నుంచి యామిని సాధినేని చూశారేమో..? చూసినప్పుడు అడగాలి కదా? ఇప్పుడెందుకు అడగటం..? వారసత్వం గురించి మాట్లాడే హక్కు లేదా..? నిజమే ఎందుకంటే ఆయన వారసత్వంతో రాలేదు కదా? తెలియదులేమ్మా..!

కవాతు దేనికోసమా? ఏం చేశాడనా? ఏం చేయలేదు అమ్మా? ఏదో మీరు చేయలేనివి చేసేద్దామనే ఆయన తపన.. అంతే! ప్రజలకోసం వద్దు.. ఆయన పర్సనల్ లైఫ్ మీద పడి ఏడవటమే.. ఎందుకంటే మీకు పీకడానికి, చెప్పడానికి వేరే కంప్లైంట్స్ లేవు కదా?’’ అంటూ అందులో యామినీని దుయ్యబట్టారు.

అలాగే…‘‘మొన్నటి దాకా బీజేపీ డబ్బులు తీసుకున్నాడు.. నిన్నేమో ఎవడో డబ్బులు ఖర్చుపెట్టాడు.. మీ అయ్యలు ఇచ్చారా..? మీ తాతలు ఇచ్చారా..? ఇవ్వలేదుగా ఇంక మళ్లీ నొప్పెందుకు..? పైసల్ ఇవ్వకుండా ఇంతమంది జనం ఎందుకు వచ్చారనా….? ఉంటదిలే కడుపులో మంట..’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈనో.. అని ఎప్పుట్నుంచో ఉంది…

అంతేకాదు.. ‘‘ఈనో.. అని ఎప్పుట్నుంచో ఉంది.. అది తాగితే  కడుపుమంట తగ్గొచ్చు అంటూ సలహా కూడా ఇచ్చారు.  అపోజిషన్ అనేది ప్రశ్నించాలి కానీ అసలు మొదలెట్టకుండా ఆపడం కాదు.. ఇకనైనా నేర్చుకొండి..” అంటూ ఫేస్‌బుక్‌లో యామినీకి మాధవీ లత స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు.

ధవళేశ్వరం వద్ద నిర్వహించిన పాదయాత్రలో పవన్ మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీసీ అధినేత వైఎస్ జగన్, మంత్రి లోకేశ్‌లను టార్గెట్ చేసి ఫైరయ్యారు. పవన్ వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేత యామినీ సాధినేని ప్రతివిమర్శలు చేశారు.

వారసత్వం గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదని.. పావలాకు కూడా చెల్లని పవన్.. రెండు వేల రూపాయిల నోటువంటి లోకేశ్ గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.  ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఇందుకు ప్రతిగా సినీనటి మాధవీలత.. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా యామినీ సాధినేనిని టార్గెట్ చేశారు. మరి మాధవీ కామెంట్స్‌పై మళ్లీ యామిని ఏ విధంగా కౌంటరిస్తారో వేచి చూడాల్సిందే.

- Advertisement -