వికేంద్రీకరణే సరైన విధానం.. మూడు ప్రాంతాలకూ సమన్యాయం: పంద్రాగస్టు వేడుకల్లో వైఎస్ జగన్

cm-ys-jagan-hoisting-the-national-flag
- Advertisement -

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంచుకోవాలని సూచించారు.

ap-cm-ys-jagan-taking-salute-from-policeచట్టం, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆయన సమానంత్వం అనే పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదన్నారు. 

రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్థికసాయం చేస్తున్నామని, 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు అందిస్తున్నామని చెప్పారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరింత అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవకుండా అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. 

రాజ్యంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకు అర్థం చెబుతూ తన 14 నెలల పాలన సాగిందని జగన్ తెలిపారు. 

రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, కాపునేస్తం, గోరుముద్ద, కంటి వెలుగు, చేయూత, పింఛన్ కానుక, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, పాఠశాలలు, ఆసుపత్రులలో నాడు-నేడు.. ఇలా ఏ పథకం తీసుకున్నా అది పేదరికం నుంచి బయటపడేయాలన్న చిత్తశుద్ధి, గట్టి సంకల్పం నుంచి పుట్టినవేనని సీఎం పేర్కొన్నారు. 

ap-cm-ys-jagan-independence-day-speach-‘‘వికేంద్రీకరణే సరైన విధానం..’’

రాష్ట్ర విభజన ద్వారా అయిన గాయాలు మానాలన్నా.. అలాంటి గాయం భవిష్యత్తులో ఎన్నడూ తగలకుండా జాగ్రత్తపడాలన్నా.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ సమన్యాయం జరగాలని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 

అందుకు అధికార వికేంద్రీకరణే సరైన విధానంగా భావించి, మూడు ప్రాంతాలకూ సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లులను చట్టంగా మార్చామని తెలిపారు. 

త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు కేంద్రంగా జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటుకు పునాదులు వేస్తామని చెప్పారు. 

 

- Advertisement -