కమల్‌ హాసన్ పార్టీలో చేరనున్న.. శృంగార తార షకీలా!?

shakila-to-join-kamal-hassan-party

చెన్నై: సినీ రంగ ప్రముఖులు రాజకీయ ఆరంగేట్రం చేయడం, సొంత పార్టీలు పెట్టడం ఎంతోకాలంగా సాగుతోంది. నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి నేటి రజినీకాంత్, కమల్ హాసన్ వరకు అందరూ నటనా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన వారే.

సినీరంగంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిని అభిమానులు ఓట్లేసి గెలిపించి పాలనాధికారం కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. దీంతో సినీరంగానికి సంబంధించిన చాలామంది సెలబ్రిటీలు ఇటు రాజకీయ రంగంలో కూడా తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. హీరోలు, హీరోయిన్లేకాదు పలువురు కమెడియన్లు కూడా ప్రజాసేవ అంటూ రాజకీయాల్లోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ప్రస్తుతానికొస్తే.. తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ లెజెండ్ కమల్ హాసన్‌లు రాజకీయాల్లో అడుగుపెట్టాడు. తాజాగా కమల్ పార్టీకి తమిళనాట మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పార్టీలో నటీమణులు శ్రీప్రియ, రచయిత స్నేహన్ వంటి పలు సినీతారలు చేరారు.

రాజకీయాల్లోకి మలయాళ శృంగారతార షకీలా… 

తాజాగా ప్రముఖ శృంగార తార, మలయాళ నటి షకీలా కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు వినిపిస్తోంది. ఆమె కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మండ్రం పార్టీలో చేరనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

అంతేకాదు, ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షకీలా స్వయంగా వెల్లడించింది. తాను కమల్ హాసన్ అభిమానిని అని.. సమయం దొరికినప్పుడు ఆయన సినిమాలు చూస్తుంటానని.. ఆయన ప్రారంభించిన పార్టీలో చేరాలనే ఆసక్తి కలుగుతోందంటూ షకీలా సదరు ఇంటర్వ్యూలో వెల్లడించింది.

అయితే కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ క్రమంగా రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ బలోపేతానికి అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన రాజకీయ నాయకులను తన పార్టీలో చేర్చుకునే ఉద్దేశంలో కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి తన సినిమాలతో కొంతకాలంపాటు కుర్రకారును ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలాకు తన పార్టీలో అవకాశం ఇస్తారో లేదో తెలియాలంటే మరికొంతకాలం వేచిచూడాల్సిందే!