ఉగాది రోజు అస్సలు చేయకూడని పనులు…..

2:26 pm, Fri, 5 April 19
1
ugadhi

తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది. ఈ ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారుఅయితే ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది.ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈ రోజు పొద్దునే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంబిస్తారు.

షడ్రుచులతో కలగలిపిన ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది రోజున ఉద‌యం తలకి స్నానం చేసిన త‌రువాత కొత్త వ‌స్ర్తాల‌ను ధ‌రించాలి. నూత‌న వ‌స్ర్తాల‌ను ధ‌రించడ‌ము అనేట‌టువంటి మాట‌లో ఒక ప్ర‌త్యేకమైన‌టువంటి విష‌య‌ముంటుంది. ఈ ఉగాది నాడు అంచుకలిగిన‌టువంటి బ‌ట్ట క‌ట్టుకోవాలి. అంచుక‌లిగిన బ‌ట్ట, ఖండ‌ముకాన‌టువంటి బ‌ట్ట ఏదైతే ఉంటుందో అటువంటి బ‌ట్ట యందు స‌మ‌స్త దేవ‌త‌లంద‌రూ కూడా ఆవ‌హించి ఉంటార‌న్న‌ది వేద‌వాక్కు. వేద‌వాక్కే ప్ర‌మాణ వాక్కు. ఏదైనా ఒక ప‌ని చేయాలి అంటే శాస్ర్తాన్ని ప్ర‌మాణం చేసుకుని చేయాలి.

అలాగే కొత్త వస్ర్తాలతో దేవునికి పూజ చేస్తే చాలా మంచిది.అలాగే ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పచ్చడి సేవించిన తరువాత కుల దేవతలకు భక్షాలు ,చిత్రానం సమర్పించాలి.వేసవి తాపాన్ని ఉపసమింప చేయడానికి వడపప్పు పానకం కూడా ఉంచి తప్పకుండ స్వీకరించాలి.లక్ష్మి పూజ చేసి దానాలు చెయ్యాలి. మీ శక్తిమేరకు దానాలు చేయవచ్చు. ఇలా మీరు చేయగలిగినంత దానం మీరు చేయడం వలన మీకు శుభం కలుగుతుంది. మీరు చేసిన ఆ దానం మీకు ధన లాభాన్ని తెచ్చిపెడుతుంది, అంతేకాకుండా పుణ్యం కూడా లభిస్తుంది.

ఇకపోతే ఉగాది పండుగ రోజున చేయకూడని పనులు కూడా చాలానే ఉన్నాయి. అందులో మొదటిది దక్షణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఉగాది రోజున ప్రశాంతంగా ఉంటూ , ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా పండుగని సంతోషం గా జరుపుకోవాలి. అలాగే ఉగాది నాడు తప్పనిసరిగా నూతన వస్త్రాలు ధరించాలి. పాత వస్త్రాలు ధరించకూడదు. మరో ముఖ్యమైన అంశం ఉగాది రోజున మాంసం తినకూడదు. అలాగే మద్యం కూడా సేవించ కూడదు. ఇలా తెలుగు వారి తోలి పండుగ అయిన ఉగాది నాడు ఇవి పాటిస్తే..మీకు , మీకుటుంబానికి చాలామంచిది.