‘భగవద్గీత’ని ఎవరు చదవాలో తెలుసా? ఇదీ గీతా రహస్యం..

secret-of-gita1
- Advertisement -

ఠక ఠకమని కర్రలు ఆడించుకుంటూ ఓ అరవై నుంచి ఎనభై ఏళ్ల ముసలివాళ్ళు గీతా మందిరాలకు వెళ్లి చదువుతున్నారు. అక్కడ జరిగే ప్రవచనాలను వింటున్నారు. లేదంటే ఇంటిలో ఒక్కరూ కూర్చొని ‘చెక్క’ మీద పెట్టి ‘భజన’ చేస్తున్నారు.. లేదా టీవీల్లో ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రసంగాలను చూస్తూ కాలం గడిపేస్తున్నారు..

నిజానికి భగవద్గీత ఉద్దేశం వయసుడిగిపోయిన ముసలి వాళ్ళ కోసం కాదు.. రేపో మాపో రాలిపోయే వారికోసం అసలే కాదు..

జీవితమంతా హ్యాపీగా ఎంజాయ్ చేసేసి.. చేయాల్సిన ఘన కార్యాలన్నీ గ్యాప్ లేకుండా చేసేసి, తిరగాల్సిన ప్రాంతాలన్నీ తిరిగేసి, వ‌ృద్ధాప్యంలో.. జీవిత చరమాంకంలో.. దేవుడా నీవే దిక్కు అంటే ఎలా?  అప్పుడు తీరిక దొరికిందని ఖాళీగా కూర్చొని గీతా పారాయణం చేస్తే ఫలితం ఉండదు.

మరేమిటి భగవద్గీత గొప్పతనం? ఎప్పుడు చదవాలి ? ఎందుకు చదవాలి? ఎలా చదవాలి?

ఎందుకంటే ..

మీరు ఒక డాక్టర్ దగ్గరకు వెళ్లారు.. జ్వరం, తలనొప్పి, పంటి నొప్పి అని చెప్పారు.. అయన కొన్ని టెస్టులు చేసి టాబ్లెట్స్ ఇచ్చారు.. మీరు అవి వాడారు.. అది శరీరానికి వచ్చిన రోగం.. మందులు వాడితే తగ్గిపోతుంది. మరి మనసుకు ‘రోగం’ వస్తే ఎక్కడికి వెళతారు..? ఏ మందులు వాడతారు..? ఇది ఏ డాక్టర్లు నయం చేయలేరు .. అప్పుడు మీకు భగవద్గీత తోడుగా ఉంటుంది.. నీడ గా నిలుస్తుంది.. ఇదెవరూ గుర్తించరు.. ఎండమావుల వైపు పరుగులు తీస్తుంటారు.. కొందరు దేవదాసుల్లా మారి.. మద్యానికి బానిసలైపోతారు..మరికొందరు రైలు కింద తలలు పెడుతుంటారు.. మరికొందరు ఎండ్రిన్ తాగేస్తుంటారు.. కొందరు కుటుంబం సహా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు.. ఇంకొందరు తెగ మథన పడిపోతుంటారు, కొందరు టెన్షన్ పడిపోతుంటారు, కొందరు నిద్ర పట్టడం లేదని నిద్ర మాత్రలు మింగేస్తుంటారు.. అబ్బబ్బా ఒకటి కాదు. ఇలా ఎన్నో తలపోట్లతో తెల్లవారుతుంటుంది.. అలా కష్టాలు తొలగించమని దేవుడ్ని ప్రార్థిస్తుంటారు.. కానీ ఆ దేవుడు ఒక పుస్తకంలో చెప్పిన సంగతులను మాత్రం ఎన్నడూ పట్టించుకోరు.

ఆ దేవుడు చెప్పిన పుస్తకం పేరే ‘భగవద్గీత’..

ఇంతకీ భగవద్గీతలో ఏముంది? ఆ రహస్యం ఏమిటి ? అంటే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కర్మ సిద్ధాంతం.  గణితంలో సూత్రాలు ఉన్నట్లే.. భగవద్గీతలో చెప్పిన సూత్రమే.. ఈ కర్మ సిద్ధాంతం.

1. మీ ఆఫీసులో బాస్ మిమ్మల్ని బాగా తిట్టాడు.. మీకు చాలా బాధ కలిగింది.. అప్పుడీ కర్మ సిద్ధాంతం అప్లై చేయాలి .. ఎలాగంటే.. ‘ఈరోజు మా బాస్‌తో తిట్లు తినాలని రాసి ఉంది.. అందుకే అలా జరిగింది ‘ – అంతే ఒక్క క్షణంలో మీ మనసులోని బాధంతా మటుమాయం..

2 .’ఎన్నాళ్లు ఉంటుందో ఈ దారిద్ర్యం .. ఎప్పటికీ కష్టాలు గట్టెక్కుతాయో’.. అనుకుంటూ ఉంటారు.. అప్పుడీ ఫార్ములా ప్రకారం .. ‘గత జన్మలో చేసిన పాపాల వల్లే ఇన్ని కష్టాలు పడుతున్నాం ‘.. అనుకుంటే చాలు.. ఆ క్షణమిక బాధ దరి చేరదు..

3. ప్రమాదవశాత్తూ పదేళ్ల బాబు మరణిస్తే.. అప్పుడేం చేస్తాం?.. ‘ఆ భగవంతుడు ఆయుషు అంతే రాశాడు..’ అంటారు.

4. పిల్లలు చెప్పిన మాట వినక పోతే… అప్పుడు ‘పిల్లలని కనగలం గాని వారి రాతను కనలేం కదా..’ అంటారు.

5. ఏ నిమిషానికి ఏమి జరుగునో .. ఎవరూహించెదరు .. విధి విలాసమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ? అని పాత లవకుశ సినిమాలో పాట చాలా పాపులర్. . అది జనం వాడుక భాషగా కూడా మారిపోయింది..

6. ఏడేళ్ల శని .. పట్టుకుంటే వదలదు అంటుంటారు .. నిజానికి ఈ మాట చాలామందికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఆ ఏడేళ్లు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తారు. ఈ లోపు ఏదొక మంచి జరుగుతుంది.. మన కష్టాలు తీరిపోయాయి అనుకుంటారు..

ఇలాంటి ఎన్నో వాక్యాలు జనంలో స్థిరపడిపోయాయి. ఇవన్నీ ఎక్కడివో కాదు.. ఆ భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినవే.. అందుకే వయసు అయిపోయిన తర్వాత కాదు గీతాపారాయణం చేయాల్సింది..  వయసులో ఉన్నప్పుడు గీత మందిరానికి వెళ్ళాలి.. భగవద్గీత చదవాలి.

అప్పుడు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్టమైన సమస్యలనైనా ఎదుర్కొనే మానసిక దైర్యం కలుగుతుంది. జీవితాన్ని నిరాశావాదంలోంచి కాకుండా.. ఆశావాదంలోంచి చూడటం ప్రారంభమవుతుంది .. ఇదే గీత రహస్యం ..

- Advertisement -