నడిరోడ్డుపై ప్రేమోన్మాది ఘాతుకం…అమ్మాయి పరిస్థితి విషమం!

madhulika katti dadi
- Advertisement -

katti

 

ఈ సమాజంలో రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. మనుషులే మానవ మృగాళ్ల మారి అతికిరాతంకంగా ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నాడు. ప్రేమ పేరుతొ వేధించడం, ప్రేమని అంగీకరించలేదని అమ్మాయిలపై దాడికి పాల్పడటం బాగా ఎక్కువైపోయాయి.

ఇంటర్ విద్యార్థినపై ఓ ప్రేమోన్మాది దాడి..

తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది..నగరంలోని బర్కత్‌పురలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో నడిరోడ్డులో మధులిక అనే ఇంటర్ విద్యార్థినపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు.

తీవ్రంగా గాయపడిన మధులిక పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంలో మధులికను ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -