అందం… ఆదితాళం!

indian-beauty
- Advertisement -

beautiful-woman

‘ఎంతో రసికుడు దేవుడు .. ఎన్ని పువ్వులు, ఎన్ని రంగులు, ఎన్ని సొగసులిచ్చాడు..
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు..’

ఈ పాట ఎప్పటిదో ..‘రాజారమేష్’ చిత్రం లో అక్కినేని, వాణిశ్రీ మధ్య మొదటి రాత్రి సన్నివేశం సందర్భంగా వస్తుంది..

అందం గురించి చెప్పాలంటే.. ముందు ఆ భగవంతుని గురించి చెప్పాలి..

అవును, ఇవన్నీ భగవంతుని సృష్టే కదా. ఈ చెట్టు, పుట్ట , గాలి, నీరు, పక్షులు, పువ్వులు, జంతువులు, ఆఖరికి ఈ రచయిత, మీరు, ఆడ, మగ అందరూ..

ఇలా ప్రకృతి నుంచి పుట్టినవారే.. మరి ప్రకృతికీ విరుద్ధంగా ఎందుకు వెళుతున్నారనేది ఉదయిస్తున్న ఒక ప్రశ్న..

అందం అంటే…

డబ్బా పౌడర్ దగ్గర పెట్టుకొని గంటలు, గంటలు అద్దం ముందు కూర్చొని తయారవడం కాదు.. మీరు ఏ మేకప్ వేసుకోవద్దు. అరె.. ఏంటి ఇలా చెబుతున్నారు అనుకోవద్దు.. ఎందుకంటే ఈ అందం అనే కాన్సెప్ట్  గురించి ఒక్కసారి ఆలోచించండి.. అసలు మేకప్ అవసరమా?  అని కూడా అడగాలనిపిస్తుంది. మరెలా ఉండాలి అని అడిగితే.. ‘‘అందం అనేది సహజంగా ఉండాలి.. అంటే ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు.  అది ప్రకృతి సిద్ధంగా ఉన్నట్టు గోచరించాలి..’ అని కొందరు చెబుతారు..

మరిలా అయితే?

ఏ చెట్టు అయినా మేకప్ వేసుకుంటుందా? ఏ పువ్వు అయినా రంగులు అద్దుకుంటుందా? ఏ పక్షి అయినా పౌడర్ రాసుకుంటుందా? మీ పాడి గేదె బ్లాక్ షూ మాత్రమే కావాలి అని డిమాండ్ చేస్తుందా? మరిప్పుడు అందం అంటే ఏమిటి ? అనే ప్రశ్నకు వస్తే.. మళ్లీ సహజంగానే ఉండడమే అనవలసి వస్తుంది.. ఎందుకంటే నేను ఊహాజనితంగా రాయలేదు. ఉదాహరణలు ఇచ్చాను. ఇప్పుడు మీ కలర్ బ్లాక్ అయినా వైట్ ఆయనా .. మీరెంత గొప్పవారైనా, టాప్ మోడల్ స్థాయిలో ఉన్నా.. అందానికి ఈ క్వాలిటీలు ఉండాల్సిందే..

1. అందమైన మీ పక్కింటి అమ్మాయిలా ఉన్నా.. ముందు మీ నవ్వు రియలిస్టిక్ గా ఉండాలి.. అంటే సహజంగా ఉండాలి.

2. ఆ తర్వాత .. మీ నడక అందంగా.. ఒక హంస నడిచినట్టు.. ఒక సినిమా కవి వర్ణించినట్టు ఉండాలి..  ‘నడిచేవో అందమా.. పరుగే నీ పందెమా..’ అని హీరో అనగానే .. హీరోయిన్ .. ‘నడకే నా అందం.. పరుగే నీ కోసము..’  అని సమాధానం ఇస్తుంది. ఆ పాటలో ఒక చరణంలో ‘నీ అడుగుల్లో హంసధ్వని రాగం ఉన్నది..’ అని కూడా వర్ణిస్తాడు ( ‘సమాజానికి సవాల్’ చిత్రంలో శ్రీదేవి నడక చూడండి)
అలా.. నడక అందంగా ఉండాలి.

3. అన్నింటికంటే కష్టమైనది ఏమిటంటే.. ముందు మీ మాట అందంగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. అని శ్రీరాముడు 16 క్వాలిటీస్ లో చెబుతాడు. ‘మాటే మంత్రమో ..మనసే బంధమో..’ ఈ పాట గుర్తు ఉంది కదా?

4. ఇంకా ముఖ్యమైనది.. ‘మీ చూపు బాగుండాలి..’ అంటే సైట్, దీని అర్థం కళ్ళజోడు పెట్టుకోమని కాదు.. మనం ఎదుటివారిని చూసే చూపు బాగుండాలి.. అదీ అందంగానే ఉండాలి. ఈ రిఫ్లెక్షన్, కళ్ళతో నవ్వడం, ఆ చూపులతో కవ్వించడం లాంటి వెర్రి, వెకిలి చేష్టలు చేస్తుంటే అప్పుడు ఆలోచించాలి.

5. ఇవన్నీ కాదు.. వీటన్నింటి కంటే ముఖ్యం.. ‘మనసు అందంగా ఉండాలి..’.

ఇదీ సంగతి…

ఇప్పుడు బయలుదేరండి.. అద్దాల ముందుకు.. అప్పుడు రెడీ అయి చూడండి..

పైన చెప్పిన 5 క్వాలిటీస్‌ని ఫాలోకండి.. అప్పుడు అద్దం ముందే కాదు.. రోడ్డు మీద ఎక్కడికి వెళ్లినా .. ఈ అమ్మాయి బాగుంది.. అబ్బాయి బాగున్నాడు అనుకుంటూ ఉంటారు. ఎలాగంటే.. ‘ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది రా’ అంటారు.. ‘అందంగా నవ్వింది రా’ అంటారు .. అంతే గాని ‘ఈ అమ్మాయి అందంగా ఉంది’ అని ఈరోజుల్లో చెప్పే వాళ్ళు చాలా తక్కువ..

ఎందుకంటే అందం పదేళ్ల తర్వాత ఉండదు.. ముసలితనం వచ్చేస్తుంది.. కానీ నవ్వుకి, మాటకి ముసలితనం రాదు. అలాగే మనసుకి కూడా.

అందుకే అందం గురించి చదవడం కాదు.. అన్వేషించండి.

ఇలా ‘అందం.వెనుక ఇంత ఇదిగా అది తాళం వేస్తేనే గాని అందం వంట పట్టదు కదా!

 

- Advertisement -