క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు పౌల్ అలెన్ (65) సోమవారం కన్నుమూశారు. ఆయన నాన్ హాడ్కిన్స్ లింఫోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గతంలో 2009లో ఒకసారి ఈ వ్యాధి బారిన పడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. కానీ మళ్లీ రెండు వారాల క్రితమే ఆ వ్యాధి మరింత తీవ్రం కావడంతో పౌల్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచం ఒకగొప్ప టెక్నాలజీ మార్గదర్శకుడిని కోల్పోయిందని మైక్రోసాఫ్ట్ వ్యస్థాపకుడు బిల్ గేట్స్ తన మిత్రుడి మరణం పట్ల తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగూ సీఈవో సత్య నాదెళ్ల , ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సహా పలువురు టెక్ నిపుణులు పౌల్ మృతిపై ట్విటర్ ద్వారా సంతాపాన్ని తెలిపారు.
అసలు మైక్రోసాఫ్ట్ సంస్థను 1975లో బిల్ గేట్స్, పౌల్ అలెన్‌లు స్థాపించారు. ఈ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్.. వారిద్దరూ ఏదైనా కొత్తగా ఒకటి చేయాలనుకున్నప్పుడు ఒకరిని ఒకరు సహకరించుకోవడం, ఒకరి ఆలోచనను ఒకరు గౌరవించుకోవడం.. ఫలితం ఎలా ఉన్నా..ఆశావాహ దృక్పథంతో చేయడం వల్లే భవిష్యత్తులో కంప్యూటర్ అనే టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించబోతుందనే విషయాన్ని వారు ముందుగా గ్రహించారు. అలా వాటిపై ప్రయోగాలు చేసి.. మార్కెటింగ్ చేయడంలో సఫలీకృతమై కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ సంపాదించిన సొమ్మును దానం చేయడంలో ఎప్పుడూ బిల్ గేట్స్‌కు పోటీగా పౌల్ నిలిచేవారు. 1983లో మైక్రోసాఫ్ట్ నుంచి బయటకి వచ్చి తను సొంతంగా మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించి విజయం సాధించారు.
We lost a great technology pioneer today – thank you Paul Allen for your immense contributions to the world through your work and your philanthropy. Thoughts are with his family and the entire Microsoft community.
— Sundar Pichai (@sundarpichai) October 15, 2018
Our industry has lost a pioneer and our world has lost a force for good. We send our deepest condolences to Paul’s friends, the Allen family and everyone at Microsoft.
— Tim Cook (@tim_cook) October 15, 2018