- Advertisement -
టోక్యో: ఆరోగ్య సమస్యల కారణంగా తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జపాన్ ప్రధాని షింజో అబే శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
పెద్ద పేగులో కణితి ఏర్పడటంతో ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.
‘గత నెల రోజులుగా నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మారింది. శారీరకంగా బాగా అలసిపోతున్నా. వైద్యులను సంప్రదిస్తే వ్యాధి తిరగబెట్టింది’ అని చెప్పారని షింజో పేర్కొన్నారు.
ప్రజలు తనపై పెట్టిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించలేక పోతున్నందున పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు.
రాజకీయాల్లో ఫలితాలను సాధించడం చాలా ముఖ్యమని, అనారోగ్యం కారణంగా రాజకీయ నిర్ణయాల్లో తాను విఫలమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
తన పదవీ కాలం పూర్తి చేయలేకపోయినందున ప్రజలకు షింజో అబే క్షమాపణలు తెలిపారు.
- Advertisement -