వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం ఖరారైందని, దీనికి సంబంధించి తేదీ, స్థలం కూడా నిర్ణయించామని చెప్పారు. దీంతో మరికొన్ని వారాల వ్యవధిలోనే వీరిరువురు సమావేశమవ్వనున్నారని స్పష్టమవుతోంది.
ఉత్తరకొరియా, దక్షిణకొరియా మధ్యగల సైనిక రహిత అద్భుతమైన వేదికని పేర్కొన్న సింగపూర్‌ను కూడా ఈ సమావేశానికి వేదికగా పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను విడిచిపెట్టడమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఉత్తరకొరియా అదుపులో ఉన్న ముగ్గురు అమెరికన్లకు కూడా విముక్తి కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇరుదేశాల మధ్య చర్చల నేపథ్యంలో ఇన్నాళ్లూ దక్షిణకొరియాలో తిష్టవేసిన తన సైన్యాన్ని కూడా ఉపసంహరించుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.