హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా త‍్వరలో పెళ్లిపీటలెక్కబోతోందనే వార్త ప్రస్తుతం సౌతిండియా సినిమా సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ నటించిన ఈ మిల్కీ బ్యూటీ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది.
ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పుష్కార కాలానికిపైగానే అయ్యింది. ఇన్నేళ్లలో గ్లామరస్ బ్యూటీగా ఆకట్టుకున్న తమన్నాకు నటిగా ప్రూవ్ చేసుకునేందుకు మాత్రం పెద్దగా అవకాశాలు దక్కలేదు. కొంత కాలంగా సరైన అవకాశాలు లేకపోవటంతో తమన్నా తన పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టిందట.
ఇప్పటికే ఆమె కుటుంబం సభ్యులు వరుడ్నికూడా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌తో త్వరలోనే తమన్నా వివాహం జరుగునుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై తమన్నా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ ‘క్వీన్’ రీమేక్‌తో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎఫ్ 2 అనే సినిమాలో నటిస్తోంది.