‘సైరా’కు బ్రేక్.. నిరాశలో చిత్ర యూనిట్!

sy-raa-movie
- Advertisement -

sy-raa-movieహైదరాబాద్: ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం.. ‘సైరా నరసింహారెడ్డి’.  ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి శరవేగంగా నడిచింది. కోకాపేట్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్  జరుగుతోంది.

చాలా పెద్ద సీక్వెన్స్ షూట్ చేయాల్సి ఉంది. దీనికోసం చిత్రం యూనిట్ రేయింబవళ్లు పనిచేస్తోంది. అయితే వర్షం ఈ షూటింగ్‌కి ఆటంకంగా మారిందట.  రెండు రోజులుగా వర్షం కురుస్తోన్న కారణంగా షూటింగ్ జరగలేదని సమాచారం. ఆర్టిస్టులు సెట్‌కి వచ్చి.. వర్షం కారణంగా వెనుదిగిరి వెళ్లిపోతున్నారట.

ఈ నేపథ్యంలో కోకాపేట సెట్‌లో షూటింగ్ మరికొన్ని రోజులు పొడిగించాల్సి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం నరసింహారెడ్డి బ్రిటీష్ ఎంపైర్‌ని ఎదుర్కొనే సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తున్నారట. ఈ సీక్వెన్స్‌లో వందల మంది ఆర్టిస్టులు నటిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -