‘లక్ష్మీబాంబ్’లో హిజ్రాగా అమితాబ్ బచ్చన్!

- Advertisement -

ముంబై: తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘కాంచన’ సినిమాను హిందీలో ‘లక్ష్మీబాంబ్’గా రాబోతోంది. ఈ సినిమాతో రాఘవ లారెన్స్‌ దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించబోతున్నట్టు బాలీవుడ్ భోగట్టా. నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించనుండగా, అతడికి జోడీగా కియారా అద్వానీ నటించనుంది.

‘కాంచన’ సినిమాలో ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ హిజ్రాగా నటించి మెప్పించాడు. ఇప్పుడదే పాత్రను హిందీలో అమితాబ్ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హిజ్రాగా నటించేందుకు అమితాబ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 2020లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు బాలీవుడ్ టాక్.

- Advertisement -