గవర్నర్‌ని కలిసిన జగన్, ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని వినతి…

jagan
- Advertisement -

హైదరాబాద్: ఏపీకి కాబోయే సీఎం, వైసీపీ అధినేత జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నారు. అక్కడ్నించి ఆయన నేరుగా భారీ కాన్వాయ్‌తో రాజ్ భవన్‌కు తరలివెళ్లారు.

రాజ్ భవన్‌లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిసిన జగన్..  ఆయనతో అరగంటపాటు సమావేశమై పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ శాసనసభా పక్షం తీర్మాన ప్రతిని జగన్ గవర్నర్‌కు అందజేశారు.

చదవండి: అప్పుడు, ఇప్పుడు 23 మందే..: చంద్రబాబుపై వైఎస్ జగన్ సూపర్ పంచ్!

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలంటూ జగన్ గవర్నర్ నరసింహన్‌ను కోరారు. జగన్ వెంట రాజ్ భవన్‌కు వచ్చినవారిలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేశ్ తదితరులున్నారు. 

మరోవైపు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ భారీ హోర్డింగ్ లు వెలిశాయి.

చదవండి: వైఎస్సార్ సీపీఎల్పీ నేతగా ఎన్నికైన జగన్…
- Advertisement -