నేటి ఉదయం 11 గంటలకు.. ఇంటర్ పరీక్ష ఫలితాలు!

inter
- Advertisement -

అమరావతి: ఎన్నికలు అయిపోయాయి. రాజకీయ నాయకుల భవిష్యత్తు మరో నెల రోజులలో విడుదల అయ్యే ఎన్నికల ఫలితాలలో తెలిసిపోతాయి. ఇప్పుడు విద్యార్ధుల వంతు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలకి సంబంధించిన ఫలితాల ప్రకటించడానికి అంతా రంగం సిద్ధం చేశారు. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఇంటర్మీడియేట్‌ బోర్డు కార్యదర్శి బి ఉదయలక్ష్మి విడుదల చేయనున్నారు.

అలాగే తెలంగాణలో కూడా అదే సమయానికి ఫలితాలు విడుదల చేస్తారు. మరి ఈ పరీక్షలలో విద్యార్ధులు ఏ స్థాయిలో సత్తా చాటారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -