మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు పెట్టిన 17 ఫైరింజన్లు!

fire-accident-in-delhi-near-metro-station
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒకవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండగా మరోవైపు కలిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని షహీన్ భాగ్ ఫర్నిచర్ మార్కెట్లో మంటలంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ఉదయం 5.55 గంటల ప్రాంతంలో ఫర్నిచర్ మార్కెట్‌లో మంటలు చెలరేగాయని, సమాచారం అందుకోగానే 17 అగ్నిమాపక శకటాలు శరవేగంతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ మెజెంటా లైన్‌లోని మెట్రో రైలు సర్వీసులపై మాత్రం ఈ అగ్నిప్రమాదం ప్రభావం పడింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చే వరకు షాహీన్ బాగ్ – బొటానికల్ గార్డెన్ స్టేషన్ల మధ్య మెట్రో సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

 

- Advertisement -