తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. 15 తర్వాతేనా?

2:50 pm, Sat, 13 April 19
telangana-inter-results-2019-to-be-announced

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రపదేశ్‌లో ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే తెలంగాణలో మాత్రం ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 15 తర్వాతే విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఫలితాల వెల్లడిపై స్పందించిన తెలంగాణ ఇంటర్ బోర్డు.. ఇప్పటిదాకా ఫలితాల వెల్లడి తేదీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది.

వీలైనంత త్వరలో తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడుతాయని, ఫలితాల వెల్లడికి అసవరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ తుదిదశలో ఉందని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ట్యాబులేషన్ పనులు కొనసాగిస్తున్నామని.. అన్ని రకాల ప్రక్రియలు పూర్తయ్యాకే ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఓ అధికారి చెప్పారు.

తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1300 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 9,42,719 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 4,52,550 మంది, సెకండియర్ విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు.

ఏ పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు…

ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు అత్యంత జాగ్రత్తగా వారు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 15 తర్వాతే ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఫలితాల విడుదలకు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఎందుకైనా మంచిదని మరోసారి సంబంధిత అధికారులు సరి చూసుకుంటున్నారు. తప్పులు లేకుండా విడుదల చేయడం మంచిది అనే ఉద్దేశంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ఉంది.

ఏప్రిల్ 13 శనివారం, ఏప్రిల్ 14 ఆదివారం.. ఈ రెండు రోజుల్లో అన్నీ సరి చూసుకుని.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలను వెల్లడించాలని బోర్డు భావిస్తోంది.

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే కొన్ని వెబ్‌సైట్లు…

bie.tg.nic.in
tsbie.cgg.gov.in
bie.telangana.gov.in
exam.bie.telangana.gov.in
http://results.cgg.gov.in/