icet

హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదలు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది వరంగల్ కాకతీయ యూనివర్శిటీ పరీక్షను నిర్వహించబోతోందని తెలిపారు.

మార్చి 7 నుంచి మే 6 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మే 9న హాల్ టిక్కెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 23, 24 ఐసెట్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఇక ప్రిలిమినరీ కీ మే 29న, జూన్ 1న వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

జూన్ 13న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు. మొత్తం 14 సెంటర్లలోని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.. వీటిలో తెలంగాణలో 12 సెంటర్లు.. ఏపీలో 4 సెంటర్లు ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.


English Title:

telangana icet 2019 exams schedule released