ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల, మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు…

3:13 pm, Mon, 11 February 19
ap ssc exams

AP SSC March 2019 Exams Time Table Schedule

అమరావతి: ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 6.10 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారని.. వీరికోసం 2,833 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తామని గంటా చెప్పారు.

పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోపే ఫలితాలను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు.

పరీక్షల షెడ్యూలు..

సబ్జెక్టు                                                       పరీక్ష తేదీ
ఫస్ట్ లాంగ్వేజ్- తెలుగు (పేపర్-1)             18-03-2019
ఫస్ట్ లాంగ్వేజ్- తెలుగు (పేపర్-2)             19-03-2019
సెకండ్ లాంగ్వేజ్- హిందీ                          20-03-2019
థర్డ్ లాంగ్వేజ్- ఇంగ్లిష్ (పేపర్-1 )             21-03-2019
థర్డ్ లాంగ్వేజ్- ఇంగ్లిష్ (పేపర్-2)              22-03-2019
మ్యాథమెటిక్స్ (పేపర్-1)                         23-03-2019
మ్యాథమెటిక్స్ (పేపర్-2)                        25-03-2019
ఫిజికల్ సైన్స్ (పేపర్ -1)                         26-03-2019
బయాలాజికల్ సైన్స్ (పేపర్-2)               27-03-2019
సోషల్ స్డడీస్ (పేపర్-1)                           28-03-2019
సోషల్ స్డడీస్ (పేపర్-2)                          29-03-2019