23 ఆగస్టు 2018 దిన ఫలాలు

horoscope
- Advertisement -

horoscopeగమనిక:

గ్రహాల స్థితి, వాటి గతులను దృష్టిలో పెట్టుకొని ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఇస్తున్నాం.  పైగా ఈ ఫలితాలు అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నవి. 

అయితే వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా మాత్రమే ఆయా వ్యక్తుల పూర్తి కచ్చితత్వంతో కూడిన  ఫలితాలు  తెలుస్తాయి.  కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ పూర్తి జాతక వివరాలను, తరుణోపాయాలను అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నాం.

 

 

మేషం

కొత్త  వాటికోసం ప్రయత్నిస్తారు.  విదేశీ చదువులకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. అయితే పాస్ పోర్ట్ , ఇతర విదేశీ వ్యవహారాల్లో కాస్తంత చిక్కులు ఎదురవుతాయి. మీ ప్రతిష్టకు భంగం కలిగే సూచనలున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ మాటలు దాటవద్దు.ఈ రోజు ప్రశాంతంగా ఉండండి.

వృషభం

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. షాపింగ్, విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. ప్రయాణాలు చేసేవారికి, ఆ రంగాల్లో పనిచేసేవారికి సాధారణంగా ఉంటుంది.  ఈ శ్రావణమాస పూజాద్రవ్యాలు విక్రయించేవారు, ఇంకా చీరలు, బంగారం వస్త్ర దుకాణాల వారు శ్రమాధికత్య  ఉంటుంది. అప్పుల కోసం చూస్తారు.

మిథునం

సాంకేతిక రంగాల్లో ఉన్నవారు అంటే, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి.   ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు, విద్యార్థులు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.   స్త్రీలు సొంతంగా ఆర్థిక స్వావలంబన సాధించడంతో  ఆసక్తి,  ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు, అవసరాలు పెరగటంతో అదనపు రాబడి కోసం  ప్రయత్నాలు చేస్తారు

కర్కాటకం

స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రిగా రంగంలోనివారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాలు తీసుకోలేక పోవడం వల్ల  తీవ్ర ఇబ్బందులు పడతారు. సమయానికి మిత్రులు సహకరించరు. శుక్రవారం పూజలు చేసుకునే మహిళలు..పనిలో  ఇంట్లో వారి సహాయసహకారాలు తీసుకుంటే మంచిది.

సింహం

ఇళ్ల  నిర్మాణంలో ఉన్నవారికి  ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. చిన్నారులు, బంధువుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెద్దల ఆరోగ్యంలో  జాగ్రత్తలు అవసరం. భార్యని  ఒప్పించడంలో సహనంగా ఉండాలి.

కన్య

రాజకీయాలలో ఉన్నవారు తమ పక్కనే ఉన్న అవకాశవాదులను గమనించాలి. ఇది రాజకీయం..ఇందులో ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్పురిస్తాయి.  ఆడవాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందు కెళ్లాలంటే తగిన సమయం కోసం ఎదురుచూడాలి. అందుకు సమయాన్ని కేటాయించాలి.

తుల

ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుకులు ఎదురైనా అధిగమిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. పెద్దల ఆరోగ్యంలో శ్రద్ధ వహించండి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం

స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తప్పవు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు.

ధనస్సు

కొన్ని పనుల కోసం  ఒకటికి రెండు సార్లు తిరగాల్సి ఉంటుంది.  ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలోను, ప్రయాణాలలోను అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

మకరం

అఫ్పులిచ్చేవారు, తీసుకునేవారికి సమస్యలు తప్పవు. మీపై మీకు నమ్మకం  ఏర్పడుతుంది. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు.

కుంభం

కుటుంబ సభ్యులు చెప్పినవాటితో    ఏకీభవించలేరు.  రాజకీయనాయకులు దూరాలు తిరగాల్సి ఉంటుంది. అయితే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.  స్త్రీలకు చుట్టప్రక్కల వారి నుండి గౌరవం, ఆదరణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సాహసాలు వద్దు.. అప్రమత్తంగా అడుగు వేయండి.

 

మీనం

ప్రశాంతంగా ఉండండి. కొన్ని  ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు.  ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్య పరిష్కారమవుతుంది.

- Advertisement -