24 నవంబర్ 2018 – శనివారం – దిన ఫలాలు

check here for Aries Horoscope, Taurus Horoscope, Gemini Horoscope, Cancer Horoscope, Leo Horoscope, Virgo Horoscope, Libra Horoscope, Scorpio Horoscope, Sagittarius Horoscope, Capricorn Horoscope, Aquarius Horoscope, Pisces Horoscope results.
- Advertisement -

Daily-Horoscop-resultsగమనిక:

గ్రహాల స్థితి, వాటి గతులను దృష్టిలో పెట్టుకొని ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఇస్తున్నాం.  పైగా ఈ ఫలితాలు అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నవి.  అయితే వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా మాత్రమే ఆయా వ్యక్తుల పూర్తి కచ్చితత్వంతో కూడిన  ఫలితాలు  తెలుస్తాయి.  కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ పూర్తి జాతక వివరాలను, తరుణోపాయాలను అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నాం.

 

 

Mesha-Rasiమేషం

పాత జ్ఞాపకాల గుర్తులు మిమ్మల్ని ఈ రోజు ఆనందంలో ముంచెత్తుతాయి.  ఆర్థికంగా ఇబ్బందులేవీ ఉండవు. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లబ్దిని తెచ్చే పరిస్థితిని అనుభూతిస్తారు. యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి.  ప్రేమ దైవపూజతో సమానం. అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు. వ్యాపారం కోసం చేస్తున్న ప్రయత్నాలు దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలవు. మీ జీవిత భాగస్వామి మీ పట్లప్రేమగా నడుచుకుంటారు. ఆ కారణం కూడా ఈ రోజు తెలుసుకుంటారు. సంతానానికి సంగీత, సాహిత్యాలలో శిక్షణ ఇప్పించాలని నిశ్చయించుకుంటారు. సరస్వతి తిలకం నుదుటున ధరించండం మంచిది.

Vrushabha-Rasiవృషభం

భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు చుర్గగ్గా సాగుతాయి. వాయిదా పసులు ఒకదారిలోకి వస్తాయి. ఆహారం విషయంలో ఎంత ఇష్టం చూపుతారో, అంతే జాగ్రత్త వహించండి. తీసుకునే నిర్ణయాలలో స్నేహితులూ, కుటుంబం ఇష్టాలను కూడా పరిగణిస్తారు. పసుపు జలాలతో అమ్మవారికి అభిషేకం చేయండం మంచిది.

Midhuna-Rasiమిథునం

వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఎంతమాత్రం సంబంధం లేని విషయాలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు.  ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మంచి దారులు వేసే అవకాశాలు ఉన్నాయి. ట్రావెల్ మరియు విద్య పథకాలు మీ తెలివిని పెంచుతాయి. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందుతారు.

Karkataka-Rasiకర్కాటకం

మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. జీవితం భద్రతపట్ల దృష్టి పెట్టడం వలన మీ ఆశలు నెరవేరుతాయి. గతంలో మీరుపడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. ఇంటికి అతిధుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.  ప్రయాణాలలో మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని అదుపులో ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తననుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు. ధనవ్యయం ఉండే అవకాశాలు ఉన్నాయి.

Simha-Rasiసింహం

మీరు అత్యంత ప్రేమగా నడుచుకునే సమయం ఇది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకు కారణం కావచ్చును. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. కొత్త పరిచయాల వలన కొంత లబ్ధిపొందుతారు.  స్థిరాస్తి అంశాలు ఓ కొలిక్కివస్తాయి. రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. భాగస్వామినుంచి చాలా ప్రేమను పొందబోతున్నారు.

Kanya-Rasiకన్య

వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. జువ్వాది పూజలలో ఉపయోగించండి. మీ నమ్మకం, మరియు శక్తి, ఈరోజు బాగా ఎక్కువ ఉంటాయి. ఆర్థిక లబ్దిని తెచ్చే పనులు ప్రారంభించబోతున్నారు. సాంకేతిక కారణాలతో అపార్థాలు చోటు చేసుకుంటాయి.  బాల్య మిత్రులను కలుసుకుంటారు. మీ సరదా స్వభావంతో మీ చుట్టూరా వాతావరణాన్ని నవ్వులతో నింపేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకుపెట్టినా, తను మీకోసం చేసినది మీరు అద్భుతమైనది అనిపిస్తుంది.

Tula-Rasiతుల

వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలూ చాలా ఆనందంగా గడుస్తాయి. కొనుగోలు, అమ్మకాల వల్ల లాభపడతారు. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.  ముఖపరిచయస్తుల నుంచి మాట సహాయాన్ని తీసుకుంటారు. సమయోచితంగా వ్యవహరిస్తారు.  ఖాళీగా ఉండకుండా ఏదైనా పనిలో లీనమవడం మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి.

Vruschika-Rasiవృశ్చికం

సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. వృత్తి-ఉద్యోగ, వ్యాపారాలపరంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఆహార, ఆరోగ్య నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. మీరు శారీకకంగా చేసుకునే మార్పులు, మీ రూపుకి మెరుగులు దిద్దుతాయి.  జీవిత భాగస్వామితో హుందాగా ప్రవర్తించండి.

Dhanoo-Rasiధనుస్సు

మిత్రులెవరో? శత్రువులెవరో స్పష్టంగా తెలుగుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బు విషయంలో చేజారిపోకుండా జాగ్రత్త వహించండి. సామాజిక జీవనం కోసం ఆరోగ్య ప్రాధాన్యత వహించాలి. కుటుంబ సభ్యులలో మీకు ప్రముఖ స్థానాన్ని లభిస్తుంది.  రొమాన్స్ కి మంచి రోజు. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది.

Makara-Rasiమకరం

మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. గతంలో దూరమైన వారితో ఇప్పుడు మంచి సంభందాలు నెరవేర్చుకుంటారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు.  ఆర్ధిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఆలోచన చేయడం మంచిది. కొద్దిగా సంకల్ప బలం లోపంచడం వలన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

Kumbha-Rasiకుంభం

మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండకుండా జాగ్రత్త వహించండి. మిమ్మల్ని వివాదాల్లోకి లాగాలని ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. రోజులోని రెండవభాగంలో ఆర్థిక అంశాల పట్ల దృష్టిసారించడం మంచిది.  ప్రేమతాలూకా స్పందనలు మిమ్మల్ని ఈ రోజంతా సంతోషంలో ముంచెత్తుతాయి. మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీ దీర్ఘకాలిక బంధాలకు చేటు కలిగించే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తవహిస్తే సులువుగా బయటపడతారు.

Meena-Rasiమీనం

క్రీడారంగంలోని వారికి అనుకూలంగా ఉంది.  మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యతను సాధించగలుగుతారు. ఆరోగ్యవిషయలకి వచ్చేసరికి మీ స్వంత ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం చూపకుండా, జాగ్రత్త వహించండి.  చేపట్టిన పనులు పూర్తై ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి  మీ భాగస్వామితో ఈ రోజు సంతోషంగా గడుపుతారు.

  • – రవి శంకర్

- Advertisement -