- Advertisement -
హైదరాబాద్: వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్ లైఫ్ స్ప్రింగ్‌లోని వైద్యులు అందించిన వైద్యం వికటించడంతో శ్వేత(28) అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… చౌటుప్పల్‌కి చెందిన శ్వేత ప్రసవం కోసం గత నెలలో లైఫ్ స్ప్రింగ్ ఆసుపత్రిలో చేరింది.
ఈ క్రమంలో ఆమెకు శస్త్ర చికిత్స చేసిన హాస్పిటల్ వైద్యులు ఆమె పెద్ద పేగు కత్తిరించారు. ఆ తర్వాత ఒక పేగుకు బదులు మరో పేగుకు అతికించారు. అంతేకాకుండా కుట్లు కూడా సరిగా వేయకపోవడంతో ఇన్ఫెక్షన్ సోకి శ్వేత మరణించింది.
శస్త్ర చికిత్స సమయంలో వైద్యులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే శ్వేత మరణించిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు లైఫ్ స్ప్రింగ్ ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే శ్వేత మరణానికి కారణమని వారు విమర్శిస్తున్నారు.
- Advertisement -