ఏపీ బడ్జెట్ 2019 రూ.2,27,984.99 కోట్లు! అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన…

ap-assembly-budget-by-finance-minister-buggana
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ఉదయం అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా వాటికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామనీ, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఏపీలో ప్రజారవాణా వ్యవస్థను ఎకో ఫ్రెండ్లీగా మారుస్తామని చెప్పారు.

రూ. 2,27,984.99 కోట్ల అంచనాతో…

అంతకుముందు 2019-20 ఆర్ధిక సంవత్సరానికి శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. రూ. 2,27,984.99 కోట్ల అంచనాతో జగన్ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందించింది.

అలాగే రాష్ట్రంలో నిరుపేదల కన్నీటిని తుడిచేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు. ప్రతీ గ్రామానికి రక్షిత మంచినీరును అందిస్తామని, ప్రభుత్వం జారీచేసే కాంట్రాక్టుల్లో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. 

కృష్ణా నది ఆయకట్టు స్థిరీకరణ, ఏపీకి ప్రత్యేకహోదా లక్ష్యంగానే ముందుకు పోతున్నామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్ ముఖ్యంశాలు…

వైఎస్సార్ రైతు భరోసా కింద యేటా మే నెలలో ప్రతీ రైతుకు ఎకరానికి రూ.12500 చెల్లింపు, వచ్చే ఏడాది మే నెల నుంచి ఈ పథకం అమలవుతుంది.  దీనికోసం రూ.8,750 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత, రూ.32618 కోట్లు.
వైద్య రంగానికి రూ.11399 కోట్లు.
గృహ నిర్మాణాలకు రూ.3617 కోట్లు.
ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు.
రైతు భరోసా పథకం కింద ఉచితంగా బోర్లు తవ్వించడానికి రూ.200 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.475 కోట్లు
రైతులకు విత్తనాల పంపిణీకి రూ.200 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.475 కోట్లు
రైతులకు విత్తనాల పంపిణీకి రూ.200 కోట్లు
పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్దికి రూ.1500 కోట్లు,
పాఠశాల నిర్వహణ గ్రాంటుకు రూ.160 కోట్లు
ప్రకృతి విపత్తుల నిర్వహణకు రూ.2000 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ.1439 కోట్లు
సంక్షేమ రంగానికి రూ.14,412 కోట్లు
అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు
ఆశావర్కర్లకు రూ.455.85 కోట్లు
పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకానికి రూ.1077 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు రూ.1140 కోట్లు
ఏపీఎస్ఆర్టీసీకి రూ.1000 కోట్లు
గిరిజన అభివృద్దికి రూ.4988 కోట్లు
దళితుల అభివృద్దికి రూ.15000 కోట్లు
వెనుకబడిన వర్గాల(బీసీ)ల అభివృద్దికి రూ.1561 కోట్లు
వైఎస్ఆర్ గృహ పథకానికి రూ.1500 కోట్లు
పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.648 కోట్లు
మత్స్యకారులకు సంక్షేమానికి రూ.410 కోట్లు
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ రూ.1740 కోట్లు
కాపు సంక్షేమానికి రూ.2000 కోట్లు
అగ్రి గోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు
కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్దరించేందుకు చర్యలు..
అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ భాష బోధన.
జగనన్న విద్యా దీవెన పథకానికి రూ.4960 కోట్లు
సీఎం కాల్ సెంటర్‌కు రూ.73 కోట్లు
రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి రూ.65 కోట్లు
అటవీ,సైన్స్&టెక్నాలజీ కోసం రూ.477 కోట్లు
పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు
నాయి బ్రాహ్మణులు,రజకుల సంక్షేమ అభివృద్దికి రూ.300 కోట్లు
కార్మిక,ఉపాధి రంగానికి రూ.978 కోట్లు

- Advertisement -