బాయ్‌ఫ్రెండ్‌పై దాడిచేసి యువతిపై సామూహిక అత్యాచారం

- Advertisement -

వేల్లూర్(తమిళనాడు): తమిళనాడులో దారుణం జరిగింది. బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది, కత్తితో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం వెల్లూరులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలో ఉన్న కోట సమీపంలో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న యువతిని ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు.

బాయ్ ఫ్రెండ్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం యువతిని కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న వస్తువులను అపహరించుకుపోయారు. అత్యాచారం, దోపిడి కేసులు నమోదు చేసిన పోలీసులు 18 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -