గుయానా: కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన భారత మహిళల జట్టు ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై కూడా అలవోకగా విజయాన్ని సాధిందింది.
గుయానా వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులే చేసింది. పాకిస్తాన్ నిర్దేశించిన 134 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ఒక ఓవర్ మిగిలుండగానే చేరుకుంది.
ఒక ఓవర్ మిగిలి ఉండగానే…
భారత మహిళల జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే పాకిస్తాన్‌కు పది పరుగుల పెనాల్టీ పడటంతో లక్ష్యం మరింత చిన్నదిగా మారింది. హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన మిథాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శనపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం జరగనున్న తన తర్వాతి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది.
The ever-cool @M_Raj03 guided her country home with 56 runs from 47 balls, earning Player of the Match honours as India seized control of Group B #WT20 pic.twitter.com/NAFsUDD0JH
— ICC World Twenty20 (@WorldT20) November 11, 2018