రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జగుతున్న భారత్-వెస్టిండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో విండిస్‌కి ఆదిలోని కష్టాలు ఎదురైయ్యయి. జట్టు స్కోరు 50కి చేరకుండానే 5 వికెట్లు కోల్పొయి కష్టాల్లో పడింది. వెస్టిండీస్ ఆట తీరు చూస్తుంటే 150 పరుగులకే అలౌట్ అయ్యేలా ఉంది. భారత్ బౌలర్‌లు విండీస్ జట్టు పరుగులు చేయకుండా కట్టుదిట్టంగా జౌలింగ్ చేస్తున్నారు.
రెండో రోజు ఆట ముగిసే సమయనికి వెస్టిండీస్ 6 వికెట్లు కొల్పొయి 94 పరుగులు చేసింది .
అంతకు ముందు భారత్ 649/9 వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత్ బ్యాట్స్‌మెన్‌లలో పృథ్వీ షా 134 (154 బంతులకు), కెప్టెన్ కోహ్లీ 139 (230 బంతులకు), జడేజా 100 (132 బంతులకు, నాటౌట్), సెంచరీలు చేయగా పుజారా 86 (130 బంతులకు), రిషబ్ పంత్ 92 (84 బంతులకు)లు సెంచరీలు విస్సయ్యారు.
వెస్టిండీస్ బ్యాటింగ్: క్రెయిగ్ బ్రత్వైట్ 2 (10 బంతులకు), కీనన్ పావెల్ 1 (6 బంతులకు), షాయి హోప్ 10 (22 బంతులకు), షిమ్ రోస్ హెట్ మెయిర్ 10 (28బంతులకు), సునీత్ అంబరీశ్ 12 (20 బంతులకు), రోస్టర్ చేజ్ 27 (38 బంతులకు, నాటౌట్) షేన్ దోవిచ్ 10 (35 బంతులకు, నాటౌట్) పరుగులు చేశారు.
భారత బౌలర్లలు మహమ్మద్ షమీ 2 వికెట్లు తీయగా… జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.