అనుకోకుండా ఒక రోజు: ధోని ఖాతాలోకి ‘అపురూప’ ఘనత

MS Dhoni3
- Advertisement -

 

MS Dhoni Batting

దుబాయ్‌: ఆసియా కప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రస్తుత కెప్టన్ రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని టీమిండియాకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా తరుపున 200 వన్టేలకు నాయకత్వం వహించిన ఘనత ఎంఎస్‌ ధోనికి దక్కింది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా చేరిందని ఐసీసీ ట్వీట్‌ ద్వారా తెలిపింది.

2017లో కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న ధోని తాజాగా ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. ఇండియా టీమ్‌కు నాయకత్వం వహించిన అతి పెద్ద వయస్సు గల ఆటగాడిగా (37 సంవత్సరాల 80రోజులు) రికార్డు నెలకొల్పాడు.

ఈ క్రమంలో హైదరాబాద్ ఆటగాడు మహ్మద్‌ అజారుద్దీన్‌( 36 సంవత్సరాల 124 రోజులు) రికార్డును ధోని సవరించాడు. ఇక ఓవరాల్‌గా టీమిండియాకు (మహిళల మరియు పురుషుల) నాయకత్వం వహించిన జాబితాలో దిగ్గజ క్రీడాకారిణి డియానా ఎడుల్జి (37 సంవత్సరాల 184 రోజులు) తొలి స్థానంలో ఉన్నారు, ఇప్పుడు ధోని రెండో స్థానంలో ఉన్నాడు.

 

- Advertisement -