‘యాత్ర’ ప్రీమియర్ షో తొలి టికెట్‌ ధర.. ఎంతో తెలుసా!?

11:01 am, Mon, 4 February 19
yatra primiyar show ticket retas

yatra primiyar show ticket retas

హైదరాబాద్: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి మన రాజన్న పాత్రలో నటించాడు.

మహి.వి.రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 8న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

చదవండి : వైఎస్సార్ బయోపిక్‌.. ‘యాత్ర’లో స్టార్ నటీనటులు! ఎవరెవరంటే…

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ అవుతోంది.  ‘యాత్ర’ సినిమా మొదటి షో టికెట్‌ ధర  వేలంలో 6,116 డాలర్లకు అమ్ముడుపోయిందట. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా.. రూ.4.37 లక్షలు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్వాణ సంస్థలు అమెరికాలోని సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి.

ప్రీమియర్‌ షో తొలి టికెట్‌ వేలం..

ఈ వేలంలో మునీశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తి తొలి టిక్కెట్‌ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నారు. $12 విలువ చేసే టికెట్‌ను ఆయనకు ఇచ్చి.. మిగిలిన మొత్తాన్ని వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తామని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్వాణ సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీనిని బట్టి ‘యాత్ర’ సినిమాకు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.