చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. అందరూ సేఫ్!

7:34 am, Sat, 31 August 19

ముంబై: ప్రముఖ నటుడు చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే, విమానానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో చిరంజీవి సహా అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. 120 మంది ప్రయాణికులతో విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరింది.

 

అయితే, టేకాఫ్ అయిన అరగంటకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.వెంటనే అప్రమత్తమైన పైలట్ ముంబై ఏటీసీ అధికారులకు సమాచారం అందించి విమానాన్ని వెనక్కి మళ్లించాడు. ముంబై విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

కాగా, విమానంలో ఉన్న చిరంజీవిని ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.