హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడైన ప్రభాస్ తన దాతృత్వాన్ని ఘనంగా చాటుకుంటున్నాడు. కరోనాపై పోరులో భాగంగా ఇటీవల పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 3 కోట్లు, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు ప్రకటించిన ప్రభాస్.. తాజాగా తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు.
కరోనా కట్టడికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం (సీసీసీ) అనే సంస్థ ఏర్పడింది. షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సీసీసీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
‘కరోనా క్రైసిస్ చారిటీ’కి నేడు ప్రభాస్ ప్రకటించిన 50 లక్షల రూపాయల విరాళంతో కరోనాపై పోరాటానికి ప్రభాస్ మొత్తం రూ. 4.50 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు అయింది. విషయం తెలిసిన అభిమానులు ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.