జోరుమీదున్న ‘ఇస్మార్ట్ శంకర్’ భామ నిధి అగర్వాల్

10:56 am, Tue, 6 August 19

హైదరాబాద్: గత కొంతకాలంగా వేధిస్తున్న ఫెయిల్యూర్స్ నుంచి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల బయటపడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లకు మంచి పేరు వచ్చింది. హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే రెండు మూడు సినిమాలకు సైన్ చేసినట్టు టాలీవుడ్ భోగట్టా. మరో హీరోయిన్ నభా నటేష్‌కు కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. కోలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నట్టు నభా ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఇంతకు మించి వివరాలన వెల్లడించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పుకొచ్చింది.