బిగ్‌బాస్ షో నుంచి తమన్నా ఔట్.. బాబా భాస్కర్ లాంటి తండ్రి ఉంటే బాగుండేదని కన్నీళ్లు!

7:06 am, Mon, 12 August 19

హైదరాబాద్: స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో మూడో వారానికి చేరుకుంది. రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్‌లో ఉన్న పునర్నవి, రాహుల్, తమన్నా, బాబా భాస్కర్, వితికా షెరులు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోగా తమన్నా ఎలిమినేట్ అయింది.

ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున తమన్నా పేరు చదవగానే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, తన కన్నీళ్లు బాబా భాస్కర్ కోసమేనని, ఆయనలాంటి తండ్రి తనకు ఉంటే బాగుండని పేర్కొంది. బిగ్‌బాస్ షోకి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. షోకి రావాలన్న తన కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది.

బాబా భాస్కర్‌కు తాను కూతురిని అయి ఉంటే సూపర్ లేడీని అయి ఉండేదాన్నని కన్నీళ్లు పెట్టుకుంది. షో మధ్యలో నటుడు వెన్నెల కిశోర్ సందడి చేశాడు. మన్మథుడు-2 ట్రైలర్ ప్రమోషన్‌లో భాగంగా షోకి వచ్చిన వెన్నెల కిశోర్ హౌస్‌మేట్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు.