కిల్ బిల్ పాండే ఈజ్ బ్యాక్! బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్!

10:01 pm, Thu, 7 February 19
allu arjun visited at bramhi home

allu arjun visited at bramhi home

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ అభిమానులని తన కామెడీ తో కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందం, ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సినిమాలని పూర్తిగా మానేసాడు. దీనికి ప్రధాన కారణం బ్రహ్మీ ఆరోగ్యం బాగాలేకపోవడమే అని తెలుస్తోంది.

ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న కామెడీ స్టార్ బ్రహ్మానందం ఆరోగ్యం గురించి అనేక పుకార్లు వచ్చాయి.

బ్రహ్మీ రియల్ ఐరన్ మ్యాన్‌…

అయితే వీటన్నింటికీ తెరదించాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవల బ్రహ్మానందం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ సర్జన్ రమాకాంత్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. కోలుకున్న బ్రహ్మీని ఇటీవలే డిశ్చార్జ్ చేయగా ఆయన ఈమధ్యే హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు.

దీనితో ఈరోజు అల్లు అర్జున్ బ్రహ్మానందం ఇంటికి వెళ్లి పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మీతో ఒక ఫోటో దిగి దాన్ని ట్వట్టర్‌లో పోస్ట్ చేసాడు బన్నీ.

బ్రహ్మీని రియల్ ఐరన్ మ్యాన్‌గా పేర్కొంటూ నా కిల్ బిల్ పాండే దాన్ని కిల్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చమత్కారంగా పోస్ట్ చేసారు. ఏదేమైనా బన్నీ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నాడని అభిమానులు హ్యాపీ గ ఫీల్ అవుతున్నారు.