పూరి, రామ్‌ల మసాలా కాబినేషన్.. ‘ఇస్మార్ట్ శంకర్’ నుంచి మరో ట్రైలర్ రిలీజ్…

ismart-shankar-movie-poster
- Advertisement -

హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ కథానాయికలు. ‘పూరీ కనెక్ట్స్‌’ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి ఈ చిత్మాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

హీరో రామ్ మేనరిజాన్ని .. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీని ఈ ట్రైలర్లో ఆవిష్కరించారు. అలాగే ఇటు నిధి అగర్వాల్ .. అటు నభా నటేశ్ కాంబినేషన్‌లో రామ్‌ నటించిన రొమాంటిక్ సీన్లు ఈ ట్రైలర్‌లో కనిపిస్తాయి. మాస్ ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో, వాళ్లను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేశారు.

అయితే ఇప్పటి వరకు చాక్లెట్ బాయ్‌గానే ఎక్కువ మార్కులు కొట్టేసిన రామ్, మాస్ హీరోగా ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి. సినిమా రీలీజ్ అయ్యే వరకు మరి మీరు కూడా ఈ ట్రైలర్ మళ్లీ మళ్లీ చూడండి.

- Advertisement -