విజయవాడ అమ్మాయితో హీరో రాజ్ తరుణ్ వివాహం…

7:45 am, Sat, 15 June 19
raj

హైదరాబాద్: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకొని వివాహ జీవితంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా మ‌రో హీరో కూడా ఏడ‌డుగులు వేయబోతున్నాడు . ఆయ‌న ఎవ‌రో కాదు, తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చిన రాజ్ త‌రుణ్.

ఆమె ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి.. పెళ్లి ఎప్పుడనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే రాజ్ తరుణ్ తొలి మూడు సినిమాల‌తో సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన ఈ కుర్ర హీరో, ఆ త‌ర్వాత అదే జోరు కొన‌సాగించలేక రేసులో వెనుకపడిపోయాడు.

ఒక్క హిట్ అంటూ చాలా కాలంగా వేచి చూస్తున్న ఈ హీరో ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఇద్ద‌రి లోకం ఒక్క‌టే అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాయే ఇప్పుడు రాజ్ త‌రుణ్ కెరీర్ డిసైడ్ చేయ‌నుంది. ఇకపోతే ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ఈ యంగ్ హీరో రాజ్ తరుణ్ తన ప్రేమ వివరాలను ఎట్టకేలకు బయటపెట్టాడు.

విజయవాడకు చెందిన ఓ యువతితో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నానని, తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించాడు. తాను పెళ్లి చేసుకోబోయే యువతికి చిత్ర పరిశ్రమతో ఎలాంటి సబంధం లేదని, తాను అచ్చమైన సంప్రదాయ తెలుగింటి అమ్మాయని తెలిపాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్ తరుణ్ తన లేడీ లవ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించాడు. ఆరేళ్ల కిందట వైజాగ్‌లో జరిగిన తన పుట్టిన రోజు వేడుకలో ఆ అమ్మాయిని తొలిసారిగా చూసినట్లు రాజ్ తరుణ్ వెల్లడించాడు. తొలి పరిచయంలోనే తమ అభిరుచులు కలిశాయని చెప్పాడు. ఆ తర్వాత తరచూ కలవడం, మాట్లాడుకోవడం మొదలైందని, క్రమంగా ఒకరిపై మరొకరికి ఇష్టం పెరిగిందని చెప్పుకొచ్చాడు.

అలా తమ ప్రేమకథ మొదలైందని తెలిపాడు. కానీ ఆమె పేరు మాత్రం చెప్పలేదు. అయితే ఆమె విజయవాడకు చెందిన అమ్మాయి అని తెలిపాడు. విజయవాడలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నట్లు వెల్లడించారు. ఆమె సింపుల్‌గా ఉండే తెలుగు ఇంటి అమ్మాయి. ప్రైవసీకి భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే పేరు బయట పెట్టడం లేదు. ఆమె కోరిక మేరకు కొంతకాలం వరకు ఈ విషయం రహస్యంగా ఉంచక తప్పడం లేదు. త్వరలోనే అన్ని విషయాలు బయట పెట్టే సమయం వస్తుందని రాజ్ తరున్ తెలిపారు.

తమ ప్రేమకు ఇరువురి తల్లిదండ్రులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని రాజ్ తరుణ్ తెలిపాడు. తన కుటుంబ సభ్యులతో ఆమె తరచూ మాట్లాడుతుందని చెప్పాడు. పెళ్లికి నేను ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. తనే ఆలస్యం చేస్తోంది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. ప్రస్తుతం జీవితాంతం ఒకరికొకరం అనే ఫీలింగ్‌లో ఉన్నాం అని రాజ్‌ తరుణ్‌ చెప్పాడు.

ఇక నేను సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేసినా, ముద్దు సీన్లు చేసినా అదంతా నటన మాత్రమే. నా వృత్తిలో భాగమే. ఈ విషయాలను ఆమె అర్థం చేసుకోగలదు. నేను మోసం చేయను అనే నమ్మకం తనకు ఉందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందన్నారు.