aakash new movie launch puri , newsxpress.online

హైదరాబాద్: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ‘ఆంధ్రాపోరి’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత పూరి డైరెక్షన్ లో మెహబూబా చిత్రంతో నటుడిగా తన టాలెంట్ నిరూపించుకున్నాడు.

కథ , స్క్రీన్ ప్లే పూరి..

తాజాగా ఆకాష్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో అనిల్ పాదురి అనే దర్శకుడు పరిచయం కానున్నారు. నేడు ఈ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్, రమాప్రభ హాజరు అయ్యారు.

ఈ సినిమాకి ‘రొమాంటిక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి కథని అందించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో కూడా పూరి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ఆకాష్ సరికొత్త లుక్ తో స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.


English Title:

purijaganandh son aakash new movie luanch today