నేను నోరు విప్పితే అందరి పరువు పోతుంది: ప్రియా వారియర్

Priya Warrior has made sensational comments, Newsxpressonline

కేరళ: కన్నుగీటి రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ పొందిన ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మలయాళంలో ‘ఒరు అడార్‌ లవ్‌’, తెలుగులో ‘లవర్స్‌ డే’ పేరుతో ఆమె నటించిన తొలి సినిమా ఇటీవలే విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ఎవ్వరికీ తెలియని పలు అంశాలు అనూహ్యంగా బయటకు వచ్చాయి.

ఈ సినిమాలో ప్రియా ప్రకాష్‌ది మెయిన్ రోల్ కాదని, ఆమె కన్నుగీటిన వీడియో సంచలనం కావడం కారణంగా నిర్మాతలు బలవంతపెట్టి మరీ స్క్రిప్ట్ మార్పించారని తెలిపాడు దర్శకులు ఒమర్‌ లులు. ఈ సినిమా విజయం సాధించక పోవడానికి ప్రియానే కారణమని ఆయన పేర్కొన్నారు.

త్వరలోనే అందరికి తెలిసి వస్తుంది…

న్యూరిన్ షరీఫ్ కూడా తనకు రావాల్సిన పేరు రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అలా అలా ఈ టాపిక్‌పై చర్చలు ఊపందుకున్నాయి. దీంతో తాజాగా ఈ అంశంపై స్పందించిన ప్రియా ప్రకాష్ ఘాటుగా హెచ్చరించింది. అసలేం జరిగిందో చెబితే తనను విమర్శిస్తున్న వారి పరువు పోతుందని తెలిపింది.

తాను ‘కర్మ’ సిద్ధాంతాన్ని నమ్ముతానని, తనను విమర్శిస్తున్న వారికి కాలమే సమాధానం చెబితుందని ప్రియా చెప్పింది. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని ఆమె పేర్కొంది.