సాహోలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభాస్ బైక్! రేటు ఎంతో తెలుసా!

3:01 pm, Thu, 4 April 19
saaho bike rate

హైదరాబాద్: సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా సాహో సినిమా రూపొందుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ బైక్ రైడింగ్ కి సంబంధించిన సన్నివేశాలను కొంతకాలం క్రితం షూట్ చేశారు.

షూటింగు దశలోనే సాహో

ఆ బైక్ కి సంబంధించిన ఫోటో ఒకటి బయటికి రావడంతో, దాని గురించి తెలుసుకోవడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రయత్నించారు.ఈ సినిమా కోసం ప్రభాస్ ట్రిమ్ప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎస్ అనే బైక్ ను ఉపయోగించాడు. 765 సీసీ లైన్ త్రీ సిలిండర్ ఇంజన్ ద్వారా ఈ బైక్ కి పవర్ సప్లై అవుతుందట.

ఈ బైక్ టాప్ లైన్ మోడల్ ధర 10.55 లక్షలు అని తెలుస్తోంది.ఈ మోడల్ బైక్ ను ఇంతకుముందు బాలీవుడ్లోనే కాదు, మిషిన్ ఇంపాసిబుల్ తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ ఉపయోగించారట. ఈ బైక్ పై మనసు పారేసుకున్న ప్రభాస్, దానిని తన సొంతానికి వాడుకునేందుకు ఇంటికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు.