హిట్ కోసం స్వయంగా రంగంలోకి దిగిన మెగాహీరో!

When is the Chitralahari's teaser release? Newsxpressonline

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన సాయి ధరమ్‌ తేజ్‌, తనకంటూ సొంత ఇమేజ్‌ కోసం కష్టపడుతున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్‌ హీరో, తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డాడు.

దీంతో తన కోసం తానే ఓ కథను రెడీ చేసుకునే పనిలో ఉన్నాడట సాయి ధరమ్‌ తేజ్‌. ఇప్పటికే ఓ లైన్‌ను సిద్ధం చేసుకున్న సాయి, పూర్తి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఈసారైనా విజయం వరిస్తుందా..

అంతేకాదు తాను రాసుకున్న కథను డైరెక్ట్ చేయాల్సిందిగా ఓ యంగ్ డైరెక్టర్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నాడట. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అన్న విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌.. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రలహరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు