వాల్మీకి సినీ నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు

1:01 pm, Sat, 14 September 19

హైదరాబాద్:
తెలంగాణ హైకోర్టు శుక్రవారం వాల్మీకి సినీ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. సినిమా షూటింగ్ రోజు నుంచి వాల్మీకి వర్కింగ్ టైటిల్‌తో పని చేస్తున్న టీం అదే టీంతో సినిమాను విడుదల చేయాలనుకుంది.

మరో వారం రోజుల్లో సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధం అయిపోయింది. ఈ సమయంలో సినిమా టైటిల్ మార్చాలంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది.

చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ నేతృత్వంలో ఏర్పాటైన బెంచ్ నోటీసులు జారీ చేస్తూ.. నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని తెలిపింది.

గోపీ బోయా మీనగ అనే వ్యక్తి బోయ హక్కుల పోరాట సమితి నుంచి ఈ సినిమా టైటిల్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వాల్మీకి అనే టైటిల్‌తో చేసిన సినిమాలో హీరో రౌడీలా కనిపిస్తున్నాడనే వాదన వినిపించారు.

ఈ షాక్‌తో టీం సినిమా టైటిల్ మార్చుకునేందుకు ఆలోచిస్తుందా.. లేదా టైటిల్‌కు ఏమైనా జత చేయనున్నారా.. అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇవేమీ కాదు వాల్మీకి టైటిల్‌తో తీసిన సినిమాలో అసలు హీరో నిజానికి నెగెటివ్ షేడ్‌లో కనిపించకపోతే అసలు సమస్యే ఉండదు. నోటీసులు జారీ చేసిన హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఈలోపు సినిమా విడుదల అవ్వాలంటే చిత్ర బృందం కోర్టుకు వివరణ ఇచ్చుకోవాలి.