‘కోబ్రా’ ఫస్ట్‌లుక్ ఈవెంట్‌లో.. వర్మ వేసుకున్న జీన్స్‌ రేటెంతో తెలుసా!?

10:53 am, Wed, 10 April 19
varma_

హైదరాబాద్: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వేసుకున్న బట్టలు రిపీట్ కాకుండా ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ని ఫాలో అవుతుంటారు. యూత్ కూడా స్టైలింగ్ విషయంలో తమకు నచ్చిన నటీనటులను స్పూర్తిగా తీసుకుంటూ ఉంటారు.

అయితే ఇప్పుడు దర్శకులు కూడా మైంటైన్ చేయడంలో మేం హీరోలకు తక్కువేమీ కాదని అంటున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తను నటిస్తోన్న ‘కోబ్రా’ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ని హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ వేడుకకు రామ్ గోపాల్ వర్మ రెడ్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకొచ్చారు. ఆయన జీన్స్ చూసిన వారు చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేశారు. వర్మ కూడా స్టైల్ ఫాలో అవుతున్నారని చమత్కరించారు.

ఇంతకీ ఆ జీన్స్ రేటెంతో తెలిస్తే షాక్ అవ్వక మానరు. అక్షరాల మూడు లక్షల రూపాయలు. ఈ రేట్ తెలుసుకున్న వర్మ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇంత ఖరీదైన ప్యాంట్ వేసుకొని వర్మ అందరికీ షాక్ ఇచ్చారు. మొత్తానికి వర్మ తన డ్రెస్సింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.