ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు: కేసీఆర్‌పై నారాయణ ఫైర్

telangana-cm-kcr
- Advertisement -

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  నారాయణ మాట్లాడుతూ…. ఫిరాయింపులపై ఏపీ సీఎం జగన్ చూసి కేసీఆర్ నేర్చుకోవాలనిచురకలు అంటించారు.

ఇప్పటికైనా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలును ఆపాలని, వేలాది మంది ఓటర్లు నమ్మి అసెంబ్లీకి పంపితే.. సిగ్గు విడిచి పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. అయితే జనాన్ని మోసం చేసిన వ్యక్తి.. కుటుంబ సభ్యులను కూడా అమ్మడానికి వెనుకాడరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక కేసీఆర్ కంటే జగన్ చిన్నోడని.. కానీ ఫిరాయింపుల విషయంలో జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని, జగన్ కాళ్ల కింద నుంచి వంద సార్లు దూరినా కేసీఆర్‌కు బుద్ధిరాదని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కేసీఆర్ ముగ్గురూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఫైరయ్యారు. అసలు ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా మారుతారని హెచ్చరించారు.

చదవండి: జగన్‌ను చూసైనా కాస్త మారేందుకు ప్రయత్నించు కేసీఆర్: విజయశాంతి
- Advertisement -