బిగ్‌బాస్: అలీ ముఖంపై తన్నిన హిమజ.. హౌస్‌లో రణరంగం

7:16 am, Thu, 8 August 19

హైదరాబాద్: బిగ్‌బాస్ హౌస్‌లో బుధవారం పెద్ద గొడవే జరిగింది. బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్ టాస్క్‌ను పూర్తి చేసే క్రమంలో సభ్యుల మధ్య గొడవ జరిగి తన్నులాట వరకు వెళ్లింది.

కెప్టెన్ టాస్క్‌లో భాగంగా శ్రీముఖి, రవికృష్ణ, అషు రెడ్డి తదితరులు దొంగలుగా మారి నిధిని కొట్టేసే ప్రయత్నం చేయగా, వరుణ్, రాహుల్, వితికా, తమన్నా, మహేశ్‌ అండ్ బ్యాచ్ నిధిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్, శివజ్యోతిలు పోలీసులుగా, హిమజ లాయర్‌గా వ్యవహరించింది.

ఈ క్రమంలో ఇంట్లో నీళ్లు తాగేందుకు వెళ్లిన హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో రెండోసారి ఆమె జేబులో చేయిపెట్టి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేయగా హిమజ అతడి ముఖంపై తన్నింది. దీంతో కోపంతో ఊగిపోయిన అలీ ఆమెపై దాడికి యత్నించాడు. లాగిపెట్టి కొడతానంటూ ఆమెపైకి వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.

చివరికి హిమజ దిగొచ్చి అలీకి క్షమాపణ చెప్పింది. అయినప్పటికీ అలీ వెనక్కి తగ్గకపోవడంతో కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. సింపథీ కోసం కాళ్లపై పడొద్దంటూ అలీ అనడంతో బాత్రూముకు వెళ్లి బోరున విలపించింది.

హిమజకు అండగా వెళ్లిన తమన్నాపైనా అలీ ఎదురుదాడికి దిగడంతో గొడవ పెద్దదైంది. అయితే, ఆ తర్వాత అలీ వచ్చి హిమజతో మాటలు కలపడంతో వివాదం సద్దుమణిగింది.

కెప్టెన్ టాస్క్‌ను తొలి నుంచి సాఫ్ట్‌గా ఆడుతున్న యాంకర్ శ్రీముఖి తన మైండ్‌కి పనిచెప్పి వరుణ్‌ సందేశ్ బోల్తా కొట్టించింది. అతన్ని మాటల్లో పెట్టి జోబులో ఉన్న డబ్బుని కొట్టేయగా.. నిధిని కొట్టేయడానికి అషూ రెడ్డితో కలిసి ప్లాన్ చేసింది. 

శ్రీముఖి టీంలో ఉన్న రవికృష్ణను జైలులో వేయడంతో శ్రీముఖి, అషులు గేమ్ ఆడటం కోసం కష్టపడ్డారు. అయితే పర్శనల్ అటాక్ చేయకపోతే.. గేమ్ గెలవడం కష్టం అని భావించిన శ్రీముఖి.. డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టాలని డిసైడ్ అయ్యి.. ఆ పని చేసింది. చుట్టు వరుణ్, వితికా, తమన్నా, మహేష్‌లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టింది. 

ఇక అప్పుడే జైలు నుండి వచ్చిన రవిని సైతం పగలగొట్టమమని శ్రీముఖి సలహా ఇవ్వడంతో అతను చేతితో అద్దాలను పగలగొట్టడంతో అతని చేతికి గాయమై రక్తం కారింది. దీంతో హౌస్‌కి డాక్టర్ వచ్చి కట్టు కట్టారు. 

మరోవైపు శ్రీముఖి వల్లే రవికి గాయం అయ్యిందని ఆమెపై అటాక్ చేశారు వితికా, రాహుల్‌లు. ఈ ఫాల్త్‌ది పగలగొట్టమని చెప్పింది అంటూ శ్రీముఖిపై అంతెత్తున లేచాడు రాహుల్. వితికా సైతం ఆమె కొట్టమంది అతను చేతిలో ఏం లేకుండానే పగలగొట్టేశాడు అంటూ ఏడుపు మొదలుపెట్టింది.

మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్ టాస్క్ తిట్లు, కొట్టుకోవడానికే పరిమితం కాకుండా వ్యక్తిగత దూషణలు పర్శనల్ ఎటాక్ వరకూ వెళ్లింది. మరి ఈ రచ్చ రేపు కూడా ఉండటంతో రేపటి ఎపిసోడ్ నిధి ఎవరు సొంతం చేసుకుంటారు? హౌస్‌కి కెప్టెన్ ఎవరు అవుతారో నేటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.